నోటిఫికేషన్ కి సిద్దంగా ఉన్న పోస్టులివే - DOTNET

నోటిఫికేషన్ కి సిద్దంగా ఉన్న పోస్టులివే


శాఖల వారీగా ఖాళీలు ఇవీ 


విద్యాశాఖలో: డిప్యూటీ డీఈఓ- 40, డిప్యూటీ ఐఓఎస్- 21, సీటీఈ లెక్చరర్స్- 48, డైట్ లెక్చరర్స్-166, ఎంఈఓ- 399 పోస్టులు ఉన్నాయి. వీటిలో 30 శాతం పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్, మిగతావి పదోన్నతులపై భర్తీ చేస్తారు.
టీచర్ కేటగిరీలో: పీజీటీ- 1,131, టీజీటీ- 719, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్స్ – 254, క్రాఫ్ట్ టీచర్స్- 313, లాంగ్వేజ్ పండిట్- 765, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం -270, పీఈటీ – 404, స్కూల్ అసిస్టెంట్ – 3,367, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ – 616, ఎస్‌జీటీ – 11,874, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ – 184 పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఈటీ – 49, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) బయాలజీ – 164, ఎస్‌ఏ ఇంగ్లిష్ – 167, ఎస్‌ఏ హిందీ – 136, ఎస్‌ఏ మ్యాథ్స్ – 215, ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ – 186, ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్ – 233, ఎస్‌ఏ సోషల్ – 117, ఎస్‌ఏ తెలుగు – 130, ఎస్‌జీటీ – 473 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

వైద్య శాఖలో: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 3,500

పంచాయతీరాజ్ శాఖలో: గ్రేడ్-1 పంచాయతీ సెక్రటరీ – 417, గ్రేడ్-2 పంచాయతీ సెక్రటరీ – 371, గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీ – 1,143, గ్రేడ్-3 పంచాయతీ సెక్రటరీ – 2,111, వీఆర్‌ఓ అండ్ వీఏఓ – 4,081, విలేజ్ సర్వెంట్- వీఆర్‌ఏ- 1,087 పోస్టులు ఉన్నాయి.

పోలీసు శాఖలో: కానిస్టేబుల్ పోస్టులు 7 వేల వరకు ఉన్నాయి. వీటిని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

గ్రూప్-1 కేటగిరీలో: డీఎస్పీ-5, డివిజినల్ పంచాయతీ ఆఫీసర్- 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ -6, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-19, ఎంపీడీఓ-114, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-32 ఉన్నాయి.

గ్రూప్-2 కేటగిరీలో: డిప్యూటీ తహసీల్దార్-156, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్- 77, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్-78, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్-45, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-4, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్- 99, అగ్రికల్చర్ ఏవో -290 తదితర పోస్టులు ఉన్నాయి.
Copyright © 2015 DOTNET All Right Reserved